Sat Mar 07 2026 21:01:41 GMT+0530 (India Standard Time)
మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. ఆయనే అభ్యర్థి అని గులాబీ బాస్ కూసుకుంట్ల పేరును అధికారికంగా ప్రకటించారు.
ముగ్గురూ ఒకే సామాజికవర్గం...
గత ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి ఆయనకే కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండనున్నారు.
Next Story

