Thu Mar 19 2026 01:16:27 GMT+0530 (India Standard Time)
Breaking : పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్
నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు

నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు స్పీకర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందచేయనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా...
దీంతో తాను హుజూర్ నగర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తానని, నల్లగొండ లోక్సభ స్థానానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్లమెంటు సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అయితే వారు ఎప్పుడు చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

