Fri Dec 05 2025 22:49:21 GMT+0000 (Coordinated Universal Time)
5న మునుగుడుకు రేవంత్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో కాంగ్రెస్ అప్రమత్తమయింది

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో కాంగ్రెస్ అప్రమత్తమయింది. ముందుగానే ఉప ఎన్నికలకు సిద్ధమయింది. ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార కమిటీని కూడా కాంగ్రెస్ వెంటనే ప్రకటించింది. రాజీనామా ప్రకటన చేసిన వెంటనే ప్రచార కమిటీని ప్రకటించడం చూస్తే కాంగ్రెస్ ముందు నుంచే ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నట్లు కనపుడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే, ఢిల్లీలో ఏఐసీసీ ప్రచార కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
ఈ సమావేశానికి...
దీంతో పాటు మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ఈ నెల 5వ తేదీన మునుగోడు లో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిని వెంటనే మునుగోడు వెళ్లి కార్యకర్తలను సమీకరించే బాధ్యతలను చేపట్టాలని అధినాయకత్వం ఆదేశించింది. ఈ నెల 5వ తేదీన మునుగోడుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
Next Story

