Sun Mar 15 2026 06:10:04 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ప్రతిపక్ష హోదా అవసరమా? అధ్యక్షా?
కేసీఆర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు

కేసీఆర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమావేశాలకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాను ఆయన తీసుకోకుండా వేరే వారికి ఇవ్వవచ్చు కదా? అని కోమటిరెడ్డి నిలదీశారు. సభకు రాని వాళ్లకు ఆ హోదా ఎందుకని ఆయన అన్నారు.
విద్యుత్తు రంగాన్ని...
గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందన్న కోమటిరెడ్డి ఛత్తీస్గఢ్ తో ఒప్పందంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ లాభం కాదని తాను 2018లోనే చెప్పానని, అయినా ఆ ప్లాంట్ కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. అంత డబ్బులు పెట్టినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయిందా? అంటే అదీ లేదన్నారు.
Next Story

