Fri Dec 05 2025 18:21:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తాను కాని, తన ప్రజలు కాని సంతోషంగా లేమని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయలేని ఈ పదవి ఎందుకు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని సమస్యలకు తన రాజీనామాయే పరిష్కారమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
రాజీనాా చేస్తానని తెలియగానే....
తాను రాజీనామా చేస్తానని తెలియగానే ప్రభుత్వం గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసిందని ఃకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి జరగుతుందంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడంతో సంచలనంగా మారింది.
Next Story

