Sun Feb 01 2026 12:39:42 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో పోలింగ్ ప్రశాంతం
మునుగోడు ఉప ఎన్నిక ప్రారంభమయింది. గంట క్రితం ప్రారంభమైన ఈ ఎన్నిక ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది

మునుగోడు ఉప ఎన్నిక ప్రారంభమయింది. గంట క్రితం ప్రారంభమైన ఈ ఎన్నిక ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. చివరి నిమిషంలో క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటింగ్ కు అవకాశమిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.
పకడ్బందీ ఏర్పాట్లు...
ఇందుకోసం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా డిజైన్ చేసిన గుర్తింపు కార్డులను ఈసారి మునుగోడు ఓటర్లకు అందించారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది పోలీసులు, పదిహేను కేంద్ర బలగాలతో భద్రను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాతంగా జరుగుతుంది.
Next Story

