Thu Dec 18 2025 09:16:06 GMT+0000 (Coordinated Universal Time)
ఈనెల 7న ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు.

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసం కుటుంబ సభ్యులతోకలసి ఆస్ట్రేలియాకు బయలేదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేసుకున్నారని చెబుతున్నారు.
కౌంటింగ్ పూర్తయిన...
గత మూడు నెలలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో అలిసి పోయి ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఈరోజే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు ఆయన వెళ్లనున్నారు. కేవలం విశ్రాంతి తీసుకోవడానికే ఆయన కుటుంబ సభ్యులతో కలసి పర్యటనకు బయలుదేరి వెళుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

