Thu Feb 12 2026 10:42:41 GMT+0530 (India Standard Time)
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడకక్కడ స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో75.88 శాతం ఓటింగ్ నమోదయింది.
వీటిలో అధికంగా...
అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. అత్యల్పంగా నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కేవలం 59.68 శాతం ఓటింగ్ నమోదయిందని, కార్పొరేషన్లలో అత్యధికంగా నల్లగొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో 59.12 శాతం పోలింగ్ నమోదయింది. రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story

