Fri Mar 27 2026 20:25:16 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం సమాప్తమయింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ర అన్ని జిల్లాల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్ సామగ్రితో రేపు తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించార.
11న కౌంటింగ్ కావడంతో...
ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేటితో ప్రచారం ముగియడంతో ఎన్నికలకు ఇంకారో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
Next Story

