Wed Mar 18 2026 01:08:49 GMT+0530 (India Standard Time)
కవితకు అరవింద్ కౌంటర్.. ఏమన్నారంటే?
తాను మళ్లీ పోటీ చేస్తానని, ధైర్యముంటే నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కవితకు ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు

తాను మళ్లీ పోటీ చేస్తానని, ధైర్యముంటే నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కవితకు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కుల అహంకారంతో కవిత మాట్లాడుతుందన్నారు. బీజేపీ వాళ్లు కవితకు ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారని, మరి కేసీఆర్ ఇంటి మీద దాడి చేస్తావా? అని ప్రశ్నించారు. మీ అయ్య ఇల్లు ధ్వంసం చేసుకోపో అని ఆయన అన్నారు. తన తల్లి మీద దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కవిత రాజకీయ ఆవేదనను అర్ధం చేసుకున్నానని అన్నారు. ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. ఆమె పోటీ చేయదలచుకుంటే నిజామాబాద్ కు రావాలని, తనపై పోటీ చేయాలని కోరారు.
మీ అయ్యను కొట్టుపో...
తనకు వచ్చిన సమాచారాన్ని చెప్పానని, అందుకే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ఇంత సీరియస్ గా కవిత రియాక్ట్ అయిందంటే మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లే భావించాలని అన్నారు. మీ అయ్యను చెప్పుతో కొట్టమని అరవింద్ సీరియస్ అయ్యారు. డెబ్భయి ఏళ్ల తన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని అరవింద్ అన్నారు. దొరతనం ఇంకా ఎన్నాళ్లో సాగదని అరవింద్ అన్నారు. తాను పార్టీకి ఫిర్యాదు చేశానని అరవింద్ అన్నారు.
Next Story

