Sat Mar 07 2026 16:19:36 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి షూటింగ్ లు బంద్
రేపటి నుంచి టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు బంద్ అవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.

రేపటి నుంచి టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు బంద్ అవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో ఉన్న కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఈ సమ్మెలో 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికులు పాల్గొంటున్నారు.
వేతన సవరణ జరిగే వరకూ....
వేతన సవరణ జరిగే వరకూ షూటింగ్ లకు ఉండబోవని కార్మిక సంఘాలు తేల్చాయి. కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ కానున్నాయి. సినీ పెద్దలు జోక్యం చేసుకున్నా వేతనాల సవరణ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో టాలివుడ్ లో కార్మికుల సమ్మె అనివార్యం కానుంది.
Next Story

