Mon Mar 16 2026 15:15:58 GMT+0530 (India Standard Time)
వరంగల్ - కరీంనగర్ రహదారిపై ఎలుగుబంటి
కరీంనగర్ జిల్లా మానకొండూరులోని ప్రధాన రహదారిపై ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది

వరంగల్ - కరీంనగర్ రహదారి పక్కన ఉన్న ఒక చెట్టుపైన కూర్చుని ఉండటంతో ప్రజలు పెద్దయెత్తున దానిని చూసేందుకు తరలి వస్తున్నారు. కరీంనగర్ - వరంగల్ రహదారిపైన చెట్టుపైకి ఎక్కి కూర్చోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
చెట్టు ఎక్కి కూర్చుని...
కాలికి గాయం కావడంతో ఎలుగుబంటిని కుక్కలు తరుముకోవడం వల్లనే చెట్టు ఎక్కిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎలుగు బంటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఎలుగుబంటి ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ స్థంభించకుండా పోలీసులు అక్కడికి వచ్చి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

