Mon Dec 08 2025 04:12:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో 1400 మంది పోలీసులకు కరోనా
కరోనా బారిన ఎక్కువగా పడుతుంది పోలీసు శాఖకు చెందిన వారే. నిత్యం వీధుల్లో విధులు చేస్తున్న వారిని కరోనా వదిలిపెట్టడం లేదు.

కరోనా బారిన ఎక్కువగా పడుతుంది పోలీసు శాఖకు చెందిన వారే. నిత్యం వీధుల్లో విధులు చేస్తున్న వారిని కరోనా వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో థర్డ్ వేవ్ లో ఇప్పటి వరకూ 1400 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. రోజురోజుకూ గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య ఎక్కువవుతోంది.
విధుల్లో ఉన్న వారిని....
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 500 మంది, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు ఎవరూ పోలీస్ స్టేషన్లకు రావద్దని సూచిస్తున్నారు. ఆన్ లైన్ ఫిర్యాదులే స్వీకరిస్తామని చెబుతున్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక కేంద్రాలను కొన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
Next Story

