Fri Dec 05 2025 07:10:46 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు మంత్రిగా అజారుద్దీన్
తెలంగాణ మంత్రివర్గంలోకి నేడు మహమ్మద్ అజారుద్దీన్ చేరబోతున్నారు

తెలంగాణ మంత్రివర్గంలోకి నేడు మహమ్మద్ అజారుద్దీన్ చేరబోతున్నారు. రాష్ట్రమంత్రిగా అజారుద్దీన్ ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి వర్గ విస్తరణకు అవసరమైన ఏర్పాట్లు రాజ్ భవన్ లో చేశారు.
రాజ్ భవన్ లో ఏర్పాట్లు...
ఈ మేరకు రాజభవన్ లో జరిగే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రులకు ఆహ్వానం కూడా అందింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేనందున అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ హైకామండ్ నిర్ణయించడంతో్ నేడు ఆయన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Next Story

