Thu Dec 18 2025 11:59:17 GMT+0000 (Coordinated Universal Time)
ముచ్చింతల్ కు చేరుకున్న ప్రధాని
ముచ్చింతల్ లోని శ్రీరామనగర్ కు మోదీ చేరుకున్నారు. కాసేపట్లో 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు

ముచ్చింతల్ లోని శ్రీరామనగర్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కాసేపట్లో 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా దీనిని నామకరణం చేశారు. శ్రీరామానుజాచార్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. సమతామూర్తి విశిష్టతను ప్రధాని నరేంద్ర మోదీకి చిన జీయర్ స్వామి వివరించనున్నారు.
సమతా మూర్తి విగ్రహాన్ని....
ముచ్చింతల్ లోని 45 ఎకరాల స్థలంలో దీని నిర్మాణం జరిగింది. ఈ సమతా విగ్రహంతో పాటు 108 దేశాలకు చెందిన ఆలయాలను కూడా నిర్మించారు. దీనిని కూడా ప్రధాని మోదీ సందర్శిస్తారు. ఇక్రిశాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక్కడ దాదాపు మూడు గంటలు గడపనున్నారు.
Next Story

