Thu Mar 19 2026 08:34:21 GMT+0530 (India Standard Time)
నేడు, రేపు వర్షసూచన
నిన్న తెలంగాణ వ్యాప్తంగా 31 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా శౌలిగౌరారంలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం..

హైదరాబాద్ : తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలుల్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం వివరరించింది. దీని ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడా మోస్టరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా.. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 31 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా శౌలిగౌరారంలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో అత్యధికంగా 44.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడేనికి చెందిన మేడి సమ్మయ్య (48) వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Next Story

