Sun Mar 08 2026 04:09:13 GMT+0530 (India Standard Time)
Congress : మరో పదేళ్లు రేవంత్ సీఎం
మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు

మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో జరిగిన రంజాన్ వేడుకలో పాల్గొన్న ఆయన ఏక్నాధ్ షిండేను సృష్టించింది బీజేపీయేనని అన్నారు. హరీశ్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచి దని హెచ్చరించారు. కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు.
ప్రజలు ఆదరించిన పార్టీని...
ప్రజలు ఆదరించిన పార్టీ జనం నమ్మకాన్ని నిలబెట్టుకుని నిలబడుతుందన్నారు. తామందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్ ను ఎందుకు మార్చారో ముందు మహేశ్వర్ రెడ్డి చెప్పాలని, పనికి రాని చిట్ చాట్ లు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగానే ముందుకు సాగుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Next Story

