Wed Jan 21 2026 11:30:46 GMT+0000 (Coordinated Universal Time)
అక్రమమని తేలితే నా గెస్ట్ హౌస్ కూల్చేయండి
నిబంధనల ప్రకారం తన గెస్ట్‌హౌస్ లేదని తేలితే దానిని కూడా కూల్చేయాలంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు

నిబంధనల ప్రకారం తన గెస్ట్‌హౌస్ లేదని తేలితే దానిని కూడా కూల్చేయాలంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాను హిమాయత్ సాగర్ ప్రాంతంలో గెస్ట్‌హౌస్ ను నిర్మించుకున్నానని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.
తనపై ఆరోపణలు అవాస్తవం...
హైడ్రా కూల్చివేతలను తాను సమర్థిస్తున్నానన్న ఆయన తన గెస్ట్‌హౌస్ అక్రమ నిర్మాణమని తేలితే దానిని కూడా కూల్చవచ్చన్నారు. తనకు ఇంత వరకూ నోటీసులు రాదని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెస్ట్‌హౌస్ లు నిర్మించుకున్నారన్న పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వం అనుమతితోనే తాము నిర్మించుకున్నామని చెప్పారు.
Next Story

