Fri Oct 11 2024 08:13:40 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉంది: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గం సమాశమైంది.
కేంద్ర సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గం సమాశమైంది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ రాత్రి మీడయా సమావేశం నిర్వహించారు. కేంద్ర కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర పోషించే అవాకశం వచ్చిందని అన్నారు. పాలసీ మేకింగ్లో మహిళలకు సముచిత స్థానం ఉండాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు.
బిల్లు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది:
ఎన్నో రోజుల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాటం కొనసాగుతోందని, దీనికి కేంద్రం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపడం సంతోషంగా ఉందని కవిత అన్నారు. అయితే పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యంతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని కవిత అన్నారు. కేబినెట్ నిర్ణయాలు అధికారికంగా చెబితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ఎప్పుడు బిల్లు పెట్టినా.. ఏదో ఒక పార్టీ అడ్డుకునేదని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందన్నారు. బిల్లులో ఏ అంశాలు ఉన్నాయో స్పష్టంగా ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ వల్లే కేంద్రం దిగి వచ్చిందని, పీఎం మోడీకి సైతం సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు.
Next Story