Sun Mar 15 2026 18:23:03 GMT+0530 (India Standard Time)
Breaking : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.
కల్వకుర్తి నుంచి...
అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే టిక్కెట్ ను గులాబీ అధిపతి కేసీఆర్ జైపాల్ యాదవ్ పేరును ప్రకటించడంతో తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోట ీచేయడానికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Next Story

