Sat Mar 21 2026 07:42:19 GMT+0530 (India Standard Time)
నేడు చెన్నైకి ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. కవిత తొలుత నటుడు అర్జున్ ఇటీవల చెన్నైలో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అర్జున్ ఆహ్వానం మేరకు కవిత ఈ ఆలయానికి వెళ్లి పూజలు జరిపిన అనంతరం వేరే కార్యక్రమంలో పాల్గొంటారు.
చర్చా వేదికలో....
అలాగే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తున్న "2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?" అనే అంశంపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. చర్చా వేదికలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వస్తారు. ఈ చర్చా వేదికలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
Next Story

