Mon Feb 02 2026 03:22:08 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ కవితకు కరోనా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనాగా నిర్ధారణ అయింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనాగా నిర్ధారణ అయింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు మూడు రోజుల నుంచి కవితకు స్వల్పంగా దగ్గు వచ్చింది. దీంతో కవిత వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
హోం ఐసొలేషన్ లోనే...
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కల్వకుంట్ల కవిత సూచించారు. తాను కొన్ని రోజుల పాటు హోం ఐసొలేషన్ లోనే ఉంటున్నానని, ఎవరూ తనను కలిసే ప్రయత్నం చేయవద్దని ఆమె కోరారు.
Next Story

