Wed Mar 18 2026 23:07:23 GMT+0530 (India Standard Time)
బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా
తనపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేసినందుకు ఎమ్మెల్సీ కవిత బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు

తనపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేసినందుకు ఎమ్మెల్సీ కవిత బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో కవిత పిటీష్ వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలపై పరువు నష్టం దావా వేసింది.
బేషరతుగా క్షమాపణ చెప్పాలని...
సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఆమె ఇంజక్షన్ పిటీషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని వీరిద్దరూ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన కవిత పరువు నష్ట దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు. రాష్ట్రంలోని 32 జిల్లా కోర్టుల్లోనూ ఇలాంటి పిటిషన్ లు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

