Sun Mar 15 2026 07:15:21 GMT+0530 (India Standard Time)
పీసీసీ చీఫ్ ఫోన్ ను కట్ చేసిన జీవన్ రెడ్డి
తాను పార్టీలో ఉండలేనని, తనను క్షమించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు

తాను పార్టీలో ఉండలేనని, తనను క్షమించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలో జరిగిన హత్యపై ఆరా తీసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తాను పార్టీలో ఒక కొనసాగలేనని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇక పార్టీలో ఉండలేనంటూ...
నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారంటూ పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ ను జీవన్ రెడ్డి కట్ చేశారు. దీంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని అర్థమయింది. అయితే అధికారిక ప్రకటన ఎప్పుడన్నది తేలాల్సి ఉంది. ఈరోజు, రేపట్లోనే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలిసింది.
Next Story

