Tue May 14 2024 00:48:22 GMT+0000 (Coordinated Universal Time)
మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈరోజు బండా ప్రకాష్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి.
మంత్రి పదవి వస్తుందనుకున్నా...
బండా ప్రకాష్ కు రాజ్యసభ పదవిలో ఉండగానే ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత బండా ప్రకాష్ ను శాసనమండలి సభ్యుడిగా ఎంపిక చేయడంతో ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని భావించారు. కానీ కేబినెట్ ర్యాంకు కలిగిన డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఆయనను కేసీఆర్ ఎంపిక చేశారు.
Next Story