Sun Mar 08 2026 02:55:02 GMT+0530 (India Standard Time)
రేపు మేడిగడ్డకు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేలు రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా వెళ్లనున్నారు

తెలంగాణ ఎమ్మెల్యేలు రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బస్సుల్లోనే వెళ్లాలని నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది.
బస్సుల్లో బయలుదేరి....
మేడిగడ్డ రిజర్వాయర్ ను రెండు గంటల పాటు పరిశీలించనుంది. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనుంది. మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని పరిశీలించేందుకు రావాలని అన్ని పార్టీల నేతలను కోరారు. అయితే బీఆర్ఎస్, బీజేపీలు ఈ పర్యటనకు దూరంగా ఉంటామని ప్రకటించాయి.
Next Story

