Thu Jan 29 2026 22:44:43 GMT+0000 (Coordinated Universal Time)
అంతా ఆయనే చేస్తున్నాడు
మంత్రి మల్లారెడ్డి ఒక నియోజకవర్గానికి మాత్రమే పదవులు ఇస్తూ వెళుతున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు

మంత్రి మల్లారెడ్డి ఒక నియోజకవర్గానికి మాత్రమే పదవులు ఇస్తూ వెళుతున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మార్కెట్ ఛైర్మన్ ను రాత్రికి రాత్రి మార్చి కొత్త వారిని ఎంపిక చేశారు. తమను సంప్రదించకుండానే మంత్రి కీలకమైన పోస్టులు భర్తీ చేస్తుండటంతో తాము కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు, వివేకానంద, అరికెపూడి గాందీ తదితరుల మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు. మంత్రి ప్రొటోకాల్ పాటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
అందరికీ అవకాశం....
కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికీ అవకాశం ఇవ్వలేకపోయామని, ముఖ్యమైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంటుందని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నామినేటెడ్ పదవులు దక్కక అనేక మంది నిరాశలో ఉన్నారన్నారు. అన్నీ మేడ్చల్ నియోజకవర్గానికే పదవులు దక్కితే తామేం చేయాలని వారు ప్రశ్నించారు. ఈ అంశాలను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు.
Next Story

