Fri Dec 05 2025 20:22:56 GMT+0000 (Coordinated Universal Time)
పాపం రాజయ్యను అలా ఎప్పుడూ చూసి ఉండరు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లను ఇవ్వాలనుకుంటున్నానో

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లను ఇవ్వాలనుకుంటున్నానో తేల్చి చెప్పేశారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు షాక్ తగిలింది. దీంతో కొందరు పార్టీ మారుతుండగా.. ఇంకొందరు ఏమీ చేయలేక ఏడ్చేశారు. పాపం తాటికొండ రాజయ్య పరిస్థితి కూడా అదే..! తనకు స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు.
మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా భోరున విలపించారు. కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజకవర్గం నుండి రాజయ్య 2014, 2018లో బీఆర్ఎస్ నుండి గెలిచారు. ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచిస్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని చెప్పుకొచ్చారు.
Next Story

