Tue Apr 07 2026 10:25:06 GMT+0530 (India Standard Time)
నేడు హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి దీక్ష
నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దీక్ష చేయనున్నారు

నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దీక్ష చేయనున్నారు. సిరసపల్లిలో డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా దీక్ష చేయనున్నారు. 48 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు కౌశిక్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ లో భారీగా పోలీసులను మొహరించారు.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా...
డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని కౌశిక్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో నేడు నలభై ఎనిమిది గంటల దీక్షకు కౌశిక్ రెడ్డి దిగనున్నారు. పోలీసులు ఈ దీక్షను కొనసాగిస్తారా? లేక భగ్నం చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

