Sun Mar 15 2026 10:54:53 GMT+0530 (India Standard Time)
పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తా
కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గౌరవం లేని చోట తాను ఉండలేనని చెప్పారు. ఎవరికింద పడితే వారి కింద పనిచేయనని చెప్పారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనివాళ్ల నాయకత్వం కింద తాను పనిచేయలేనని చెప్పారు.
ఏ పార్టీలోకి అనేది....?
అయితే ఏ పార్టీలోకి వెళతాను? ఎప్పుడు వెళతానన్నది త్వరలోనే స్పష్టత ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ను వీడాలంటే కొంత బాధగానే ఉందని చెప్పారు. కార్యకర్తలకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోబోనని తెలిపారు. సమస్యలపై కేసీఆర్ పై తన పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు.
Next Story

