Fri Jun 20 2025 01:46:20 GMT+0000 (Coordinated Universal Time)
నేనూ నడుస్తా ... అనుమతివ్వండి
తనకు పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు

తనకు పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈమేరకు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
అనుమతివ్వకపోతే...
అందుకు అనుమతి ఇవ్వకపోతే తాను ఏం చేయాలో నిర్ణయించుకుంటానని తెలిపారు. మొత్తం 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ జగ్గారెడ్డి ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఠాక్రే జగ్గారెడ్డి పాదయాత్రకు అనుమతి ఇస్తారా? ఇవ్వకుంటే జగ్గారెడ్డి ఏం చేయనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Next Story