Fri Dec 05 2025 12:40:53 GMT+0000 (Coordinated Universal Time)
ఆ టిక్కెట్ నాదే
వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ తనదే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెబుతున్నారు

వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ తనదే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెబుతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ తనకు తానే ప్రకటించుకున్నారు దానం నాగేందర్. ఈ విషయం కేసీఆర్కు కూడా తెలుసు అని దానం చెప్పారు.
జరుగుతున్న ప్రచారానికి...
హైదరాబాద్ నగరంలో కొందరు సిట్టింగ్లకు ఈసారి టిక్కెట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. దాసోజు శ్రావణ్ పార్టీలో చేరడంతో ఆయనకు ఈసారి ఖైరతాబాద్ టిక్కెట్ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. దాసోజు శ్రావణ్ మంత్రి కేటీఆర్కు సన్నిహితుడు కావడంతో దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.
Next Story

