Sat Jul 12 2025 22:18:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు వరంగల్ కు ప్రపంచ సుందరీమణులు
నేడు ప్రపంచ సుందరీమణులు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగుతున్నాయి. అయితే వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మొన్న నాగార్జున సాగర్ కు వెళ్లి బుద్ధభవన్ ను సందర్శించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా అక్కడకు వెళ్లి కాసేపు గడిపారు. నిన్న చార్మినార్ ప్రాంతంలో పరేడ్ జరిపారు. చుడీ బజార్ లో గాజులను కొనుగోలు చేసి హడావిడి చేశారు.
ప్రముఖ ప్రాంతాల్లో...
నేడు ప్రపంచ సుందరీమణులు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో ప్రముఖంగా ఉన్న వెయ్యి స్థంభాల గుడిని సందర్శిస్తారు. అనంతరం రామప్ప ఆలయంతో పాటు ఓరుగల్లు కోటను కూడా 109 దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారుల ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Next Story