Sat Nov 08 2025 00:15:34 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : కుడి వైపు కూర్చున్న వాళ్లే మృతులు.. బస్సు మిస్ అయిన అదృష్టవంతులు ఎందరో?
తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ వెనక వైపు కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు

తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ వెనక వైపు కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు. అంటే కుడి వైపున కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు. ఎడమ వైపు కూర్చున్న వారు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మొత్తం 72 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి బయలుదేరిన బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఇరవై మంది మరణించారు. ఈ ఇరవై మందిలో ఎక్కువ మంది కుడి వైపున అంటే డ్రైవర్ వెనక వైపు ఉన్నవారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చాలా మంది బస్సులో ఎక్కువ మంది ఉండటంతో తర్వాత బస్సులో బయలుదేరారు. కొందరికి బస్సు మిస్ కావడంతో వేరే బస్సును ఆశ్రయించి ప్రాణాలను కాపాడుకున్నారు.
డ్రైవర్ వెనక వైపు ఉన్న
డ్రైవర్ తో పాటు ఆయన వెనక కూర్చున్న దాదాపు తొమ్మిది సీట్లలో ప్రయాణికులు ఎక్కువ మంది మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సును చూస్తేనే కుడి వైపున ఉన్న వాళ్లే ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు కూడా గుర్తించారు. సోమవారం కావడంతో వివిధ పనుల కోసం హైదరాబాద్ కు బయలుదేరి వస్తున్నారు. టిప్పర్ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందని వారికి తెలియదు. కొందరు ఈ బస్ మిస్ కావడంతో వేరే బస్సులో వస్తూ ప్రాణాలను కాపాడుకున్నారు.
అద్దెతో నడిచే బస్సు...
చేవెళ్ల మండలం మిర్జాగూడలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఎస్ఆర్టీసీ హైరులో నడిచిన బస్సు డ్రైవర్ను దస్తగిరి బాబాగా పోలీసులు గుర్తించారు. టీఎస్34 టీఎ 6354 నంబరు గల బస్సు ఉదయం 5 గంటల సమయంలో తాండూర్ బస్టాండ్ నుంచి బయలుదేరింది. సుమారు 6.15 గంటలకు మిర్జాగూడ వద్ద ప్రమాదం జరిగింది.అధికారుల వివరాల ప్రకారం, ఈ వాహనం టీఎస్ఆర్టీసీ అద్దెతో నడిచేది. ఘటన సమయంలో బస్సు కండక్టర్ రాధకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె వాహనం ఎడమవైపున కూర్చున్నందువల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని పోలీసులు తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై ఒక్కటికి చేరుకుంది.
Next Story

