Tue Dec 23 2025 04:18:05 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు మేడారానికి మంత్రులు
తెలంగాణలోని మేడారంలో నేడు మంత్రులు పర్యటించనున్నారు

తెలంగాణలోని మేడారంలో నేడు మంత్రులు పర్యటించనున్నారు. మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసులురెడ్డి, సీతక్కలు పర్యటించనున్నారు. మేడారం జాతర కు సంబంధించిన ఏర్పాట్లు, పనుల పురోగతిని మంత్రులిద్దరూ పరిశీలించనున్నారు. ఉదయం పది గంటలకు మేడారం చేరుకోనున్న మంత్రులు అధికారులతో సమీక్ష చేయనున్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష...
మేడారం జాతర దగ్గరపడుతుండటంతో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతరకు కోట్ల మంది భక్తులు వస్తుండటంతో వారు ఇబ్బందులు పడకుండా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టారు.
Next Story

