Sun Apr 27 2025 23:22:41 GMT+0000 (Coordinated Universal Time)
బతికి ఉన్నారనే రెస్క్యూ చేస్తున్నాం : ఉత్తమ్
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో చిక్కుపోయిన ఎనిమిది మంది బతికి ఉన్నారనే భావించి రెస్క్యూ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో చిక్కుపోయిన ఎనిమిది మంది బతికి ఉన్నారనే భావించి రెస్క్యూ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీంలను ఇక్కడకు రప్పించి టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గ్యాస్ కట్టర్లతో మిషన్ భాగాలను కట్ చేసే పనిలో ఉన్నారన్నారు. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్య్కూ ను వేగవంతం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బురద పేరుకు పోవడంతో...
పదిహేను నుంచి ఇరవై మీటర్ల లోతులో బురద పేరుకుపోయి ఉందని ఆయన తెలిపారు. అధికారులందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారన్న ఉత్తమ్, తమ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఒక మానవీయ కోణంలో చూడాల్సిన ఘటనను విపక్షాలు రాజకీయం చేసి మాట్లాడుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెస్క్యూలో పాల్గొన్నవారు రిస్క్ లో పడకూడదనే జాగ్రత్తగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ ను మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.
Next Story