Mon Apr 21 2025 18:24:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గాంధీ భవన్ కు తుమ్మల
ఈ రోజు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు

ఈ రోజు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి ఈ రోజు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ జిల్లా లో పర్యటించడం తో వాయిదా పడింది.
వరసగా వారం రోజులు...
ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ దామోదర్ రాజా నర్సింహ, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
Next Story