Sat Dec 13 2025 22:43:25 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రానికి తుమ్మల లేఖ.. ఆ గ్రామాలను మాకు ఇవ్వండి
భద్రాచలంలోని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు

భద్రాచలంలోని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తుమ్మల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఈ లేఖ రాశారు. భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉన్నారని, శ్రీరాముడికి చెందిన భూములు ఆంధ్రా భూభాగంలో ఉన్నాయని తెలిపారు.
పునర్విభజన చట్టంలోని...
భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని, పునర్విభజన చట్టంలోని ఉభయ రాష్ట్రాల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి తెలుగు ప్రజల ముఖ్యంగా భద్రాద్రి, ఐదు గ్రామాల ప్రజల తీరని వేతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల విన్నవించారు. పునర్విభజన చట్టంలోని భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరారు.
Next Story

