Fri Mar 20 2026 01:05:53 GMT+0530 (India Standard Time)
నేడు మెదక్ లో బతుకమ్మ ఆడనున్న సీతక్క
నేడు మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు

నేడు మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన టీపీసీసీ అధికార ప్రతినిధి చుక్కల ఉదయ చందర్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించనున్నారు. ఇటీవలే మాతృవియోగం పొందిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టెం ఉపేందర్ ను కూడా మంత్రి సీతక్క పరామర్శించనున్నారు.
మెదక్,మహబూబాబాద్ జిల్లాల్లో
అనంతరం సాయంత్రం మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మంత్రి సీతక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. మెదక్, మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తుండటంతో పెద్దయెత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
Next Story

