Sun Mar 15 2026 14:01:57 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఇదే !
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రకటించారు.

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రకటించారు. జులై 13న ఈసెట్ జరగనుండగా.. 14 నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 28 సెంటర్లలో.. 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సబితా పేర్కొన్నారు. అలాగే ఎంసెట్ పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ర్యాంకులు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story

