Sat Mar 21 2026 13:50:52 GMT+0530 (India Standard Time)
జీవన్ రెడ్డితో మంత్రుల మంతనాలు
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు

జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సమావేశమై జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చిస్తున్నారు. తొందరపడి పార్టీని వీడవద్దంటూ మంత్రులు జీవన్ రెడ్డికి చెబుతున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు చర్చలు జరుపుతున్నారు.
పార్టీని వీడవద్దంటూ...
ఏదైనా సమస్యలుంటే తాము పార్టీనాయకత్వంతో మాట్లాడతామని, అంతే కాని పార్టీని మారవద్దని చెబుతున్నారు. అన్ని సమస్యలు హైకమాండ్ పరిష్కరిస్తుందని భరోసా ఇస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి కూడా తాను పార్టీ మారితే కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదని, తనను నిర్లక్ష్యం చేసినప్పుడు ఎందుకు రాలేదని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.
Next Story

