Mon Apr 21 2025 17:37:39 GMT+0000 (Coordinated Universal Time)
మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు : మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనంతో ఉన్నారన్నారు

మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనంతో ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని పదే పదే అంటున్నారని ఆయన మండి పడ్డారు. ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ ఏదో సాధించాలని కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒకసారి గుణపాఠం చెప్పారని, రెండోసారి కూడా ఓడించడానికి సిద్ధంగా ప్రజలున్నారన్నారు.
ఎన్ని సెటైర్లు వేసినా?
మంత్రి కేటీఆర్ ఎన్ని సెటైర్లు వేసినా మా ప్రభుత్వం పని మేం చేసుకుంటామని పొన్నం ప్రకభాకర్ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు దిశగా వెళ్తున్నామన్న ఆయన ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కూడా కాకముందే విమర్శలు మొదలుపెట్టారంటూ ఫైర్ అయ్యారు. అనవసర ప్రచారాలు మాని అభివృద్ధిపై సూచనలు అందించాలని కోరారు.
Next Story