Sat Jan 31 2026 16:24:08 GMT+0000 (Coordinated Universal Time)
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై మంత్రి పొన్నం క్లారిటీ
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో టిక్కెట్ ను కాంగ్రెస్ అధినాయకత్వమే కేటాయిస్తుందని, అయితే స్థానికంగా ఉన్న వారికి మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్థానికంగా ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నేతలకు మాత్రమే టిక్కెట్ ఇస్తారన్నారు.
స్థానికంగా ఉన్న వారికి మాత్రమే...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, అయితే నియోజకవర్గంలోని ప్రజల్లో విశ్వాసం చూరగొన్న వారికి మాత్రమే టిక్కెట్ కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనేక మంది టిక్కెట్ ఆశించే అవకాశమున్నా, విజయం ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ మేరకు ఏఐసీసీ అభ్యర్థిని నిర్ణయిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బయట నియోజకవర్గం నుంచి వచ్చే వారికి మాత్రం అవకాశం ఉండదని తెలిపారు.
Next Story

