Mon Dec 22 2025 09:29:31 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటికే మీ బిడ్డ కవిత నీ తోలు తీస్తుంది.. కేసీఆర్ కు కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీడియా సమావేశంలో కూర్చుని తోలు తీస్తామంటే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే డీపీఆర్ వెనక్కు వచ్చిందని అన్నారు. నిజంగా నీటి పారుదల శాఖపై చర్చించాలంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చించడానికి తాము కూడా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
అసెంబ్లీకి వచ్చినా...
ప్రజలు మీ తోలు తీసినా మీలో మార్పు రాలేదన్నారు. కేసీఆర్ పాతపురాణాన్ని వల్లె వేశారన్నారు. దద్దమ్మ పాలన చేసింది తాము కాదని,మీరేనని పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ హయాంలో డీపీఆర్ వెనక్కు వచ్చినప్పుడు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. జగన్, మోదీతో అంటకాగినప్పుడు ఏమయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పటికే మీ బిడ్డ కవిత నీ తోలు తీస్తుందని మండి పడ్డారు.
Next Story

