Tue Feb 03 2026 22:03:45 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర : మంత్రి పొన్నం
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదు అంటున్నారదని, అంత సీనియర్ నేత అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు.
ఇలా మాట్లాడవచ్చా?
బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఇలా మాట్లాడవచ్చా..? అని కూడా పొన్నం ప్రభాకర్ నిలదీశారు. రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా..? 10 మంది ఎమ్మెల్యేలు పోతారు అంటున్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండి పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వీరి వ్యాఖ్యలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story

