Thu Mar 19 2026 03:00:17 GMT+0530 (India Standard Time)
పోలవరాన్ని మేమే పూర్తి చేస్తాం
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్న ఇప్పటి వరకూ పోలవరం పూర్తిచేయలేదని మల్లారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే తమ పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
175 నియోజకవర్గాల్లో...
బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తుందన్నారు. తెలంగాణ అమలవుతున్న పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్న డిమాండ్ వినపడుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేేస్తుందని, ప్రజలు కూడా ఆదరిస్తారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Next Story

