Thu Mar 19 2026 03:01:10 GMT+0530 (India Standard Time)
ఐటీ ముందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు
ఆదాయపు పన్ను శాఖ అధికారుల వద్ద విచారణకు నేడు మంత్రి మల్లారెడ్డి, అతని బంధువులు ఈరోజు హాజరు కావాల్సి ఉంది.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల వద్ద విచారణకు నేడు మంత్రి మల్లారెడ్డి, అతని బంధువులు ఈరోజు హాజరు కావాల్సి ఉంది. ఈరోజు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇటీవల మల్లారెడ్డి అతని బంధువుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 18.50 కోట్ల రూపాయల నగదుతో పాటు పదిహేను కిలోల బంగారాన్ని కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారు.
విచారణకు...
దీనికి సంబంధించి విచారించేందుకు మల్లారెడ్డితో పాటు మొత్తం 16 మందికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మల్లారెడ్డి మాత్రం ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశాలు కన్పించడం లేదు. ఆయన మినహా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశముందని తెలిసింది.
Next Story

