Wed Jan 21 2026 03:53:17 GMT+0000 (Coordinated Universal Time)
వేములవాడకు నేడు కేటీఆర్
వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు

రాజన్న సిరిజిల్లా వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు. వేముల వాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో సీటీస్కార్, పీఎన్ఏ ప్లాంట్లను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
అభివృద్ధి కార్యక్రమాలు...
కోరుట్ల బస్టాండ్ లోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు మధ్యాహ్నం కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వేములవాడ మండలంలోని మర్రిపల్లిలో రైతు వేదిక, కేజీబీవీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటారు. వేములవాడకు కేటీఆర్ వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.
- Tags
- ktr
- vemulavada
Next Story

