Wed Mar 18 2026 09:36:24 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ కు వాట్సాప్ చిక్కులు.. ఎంతకూ ఓపెన్ అవ్వడం లేదట..!
కేటీఆర్ కు వాట్సాప్ చిక్కులు.. ఎంతకూ ఓపెన్ అవ్వడం లేదట..!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వాట్సాప్ గడచిన 24 గంటలుగా స్తంభించిపోయిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా కేటీఆరే వెల్లడించారు. దాదాపుగా 8 వేలకు పైగా సందేశాలు వచ్చిన నేపథ్యంలోనే తన వాట్సాప్ స్తంభించిపోయిందని ఆయన తెలిపారు. తన వాట్సాప్ సోమవారం నుంచి మూడు పర్యాయాలు తెరచుకున్న వాట్సాప్ ఆ వెంటనే తిరిగి స్తంభించిపోతోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గత 24 గంటలుగా తన వాట్సాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నానని ఆయన చెప్పారు. తన వాట్సాప్ స్తంభించినట్లు కనిపిస్తున్న సందేశాన్ని ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. కేటీఆర్ అకౌంట్ బ్లాక్ అవ్వడానికి గల కారణాన్ని వాట్సాప్ తెలియజేస్తూ.. 'స్పామ్ కారణంగా ఈ వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదు' అనే అలర్ట్ ఇచ్చింది.
"Got kicked out of my @WhatsApp thrice since yesterday as I had more than 8 thousand messages!
Was trying to respond to as many messages as possible but it now has become inaccessible for last 24 hours
#DigitalChallenges" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఎడమ కాలి వేలికి గాయం కాడంతో కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేటీఆర్ ఆరోగ్య సమాచారం కోసం బంధు మిత్రులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆయన వాట్సాప్‌కు మెసెజ్‌లు పంపుతున్నారు.
Next Story

