Fri Dec 19 2025 02:23:43 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ బర్త్ డే స్పెషల్.. వీరయోధ పాటను షేర్ చేసిన కేటీఆర్
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూపొందిన వీరయోధ అనే పాటను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కేవలం తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా జరుగుతుండటం విశేషం. బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ లోనూ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టడం విశేషం. ఇక తెలంగాణలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీ దళం సంబరాల్లో మునిగి తేలుతోంది. కొన్ని ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో, తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా.. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూపొందిన వీరయోధ అనే పాటను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్లతో పంచుకున్నారు. "భారతీయతే మనకు ప్రాణం-అది కేసీఆర్ హృదయనాదం-నీ వెంట నిలుస్తాం-నడుస్తాం-గెలుస్తామయా" అంటూ మన ప్రియతమ నాయకుడు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం సందర్బంగా రూపొందించిన 'వీరయోధ' పాట ఉద్వేగభరితంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పాటకు అభిజ్ఞ రచన, గానం అందించగా... ఎస్కే బాజి సంగీతం అందించారు. కె.లక్ష్మణ్ నిర్మాణంలో పూర్ణ దర్శకత్వం వహించారు.
News Summary - Minister KTR Shares Veera Yodha Special Song on the Occation of CM KCR's Birthday
Next Story

